చిలకలూరిపేటలో ఎంపీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీసుల హెచ్చరిక
చిలకలూరిపేట మేజర్ న్యూస్:
ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చిలకలూరిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.సుబ్బానాయుడు,రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.నామినేషన్ల దాఖలు కోసం వచ్చే అభ్యర్థులు,నాయకులు పోలీసుల ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.నామినేషన్లకు వచ్చే వాహనాలను కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయాలని స్పష్టం చేశారు.చిలకలూరిపేట పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా గుమిగూడటానికి అనుమతి లేదని తెలిపారు.నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని,కార్యాలయం వద్దకు ర్యాలీలుగా రావడాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా,నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా,పారదర్శకంగా సాగేందుకు అభ్యర్థులు,రాజకీయ నాయకులు పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
రిపోర్టర్:కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట ఆర్సి ఇంచార్జ్