BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలి

Select Suryaa Now
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : సిపిఎం, సిపిఐ నెల్లూరు రూరల్ మండల కమిటీల ఆధ్వర్యంలో సౌత్ మోపూరు గ్రామంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలని కోరుతూ.. జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలూరు తిరుపాలు, మండల కార్యదర్శి పూడిపర్తి జనార్ధన్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పముజుల హరి మాట్లాడుతూ.... కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ దేశ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నిరంకుశంగా వ్యవహరిస్తూ తీసుకువచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలలో 13 కోట్ల 50 లక్షల ఓట్లు తొలగించారని దీనితో అనేకమంది అర్హత కలిగిన ఓటర్లు తమ ఓట్లు కోల్పోయి ఎన్నికలలో ఓటు వేయలేకపోయారని  అన్నారు. కేంద్రంలోని పాలకులు ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకోవడం లోనే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి తమకు అనుకూలమైన మంత్రిని పెట్టుకొని తాము చెప్పినట్టు వినే అధికారి చేత ఎస్ఐఆర్ ప్రక్రియను   నడిపించడం దుర్మార్గమని అన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్ లో ఉన్న సభ్యుల మాటని లెక్కచేయకుండా నిరంకుశంగా వ్యవహరించి ఎస్ ఐ ఆర్ బలవంతంగా దేశ ప్రజలపై రుద్దాలని చూస్తున్న జ్ఞానేష్  కుమార్ ని వెంటనే తొలగించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ విషయంపై దేశంలో అనేక ప్రాంతాల్లో జన్ జీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యులు జానా లక్ష్మీ ప్రసాద్, పాదర్తి మస్తానయ్య,అట్లా అనిల్, గుంటి.నాగరాజు, గుడి రవీంద్ర,పేరత్తూరు నాగరాజు,అచ్చి అనంతయ్య సిపిఐ నాయకులు చల్లా నరసయ్య మారెం సుబ్బారావు,విష్ణు,మన్నెం రాంబాబు గ్రామ నాయకులు మన్నవరం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.