BREAKING
కోడుమూరు స్నేహ వృద్ధాశ్రమానికి యూఎస్‌టీ సంస్థ చేయూత వృద్ధులకు నిత్యావసర వస్తువులు, వైద్య సహాయక పరికరాల అందజేత గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు* జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్ ఘనంగా భక్త కనకదాసు 539వ జయంతి వేడుకలు : హాజరైన సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు : విచ్చేసిన జెడ్పిటిసి జబ్బల మీనా,కౌన్సిలర్లు పార్వతి,మల్లికా

చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు సత్తాచాటాలి : విజయభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు పిలుపు : స్పోర్ట్స్ డేలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు

Select Suryaa Now
చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు సత్తాచాటాలి : విజయభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు పిలుపు : స్పోర్ట్స్ డేలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు

మదనపల్లె,మేజర్ న్యూస్ : చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని మదనపల్లె విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు తెలిపారు.పాఠశాల 35వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్పోర్ట్స్ డే గురువారం ఘనంగా ప్రారంభ మైంది.ఇందులో భాగంగా స్థానిక జీఆర్టీ మైదానం తొలిరోజు ఖోఖో లీగ్ పోటీలు నిర్వహించారు.రెండు,మూడు రోజుల్లో క్రికెట్ లీగ్‌తో పాటు ఇతర క్రీడాపోటీలు నిర్వహించనున్నారు.ఈ ఏడాది నిర్వహిస్తున్న సీజన్-3 ఖోఖో లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి.ఇందులో నాలుగు లీగ్ మ్యాచ్‌లు,రెండు సెమీఫైనల్స్,ఒక ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు.విద్యార్థులు ఎంతో ఆసక్తితో,ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నిషితా సేతు మాట్లాడుతూ ఖోఖో లీగ్‌లో పాల్గొన్న ఎనిమిది జట్ల విద్యార్థులను అభినందించి,వారికి శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి,వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.శుక్రవారం,శనివారం  క్రికెట్ లీగ్ మ్యాచ్‌ లు నిర్వహించనున్నట్లు తెలిపారు.గత రెండు సీజన్లలో క్రికెట్ లీగ్ పోటీలు అద్భుతంగా జరిగాయని గుర్తుచేస్తూ ఈ ఏడాది కూడా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి అద్భుత ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి