బ్యాలెట్ బాక్సుల భద్రతపై ఎంపీడీవో తనిఖీలు
రేణిగుంట మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను ఎంపీడీవో రవిచంద్ర శనివారం పరిశీలించారు. పెద్దవి, చిన్నవి కలిపి మొత్తం 200 బ్యాలెట్ బాక్సుల సంఖ్య, వాటి స్థితిగతులను తనిఖీ చేశారు.బాక్సులు తుప్పు పట్టకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, సీలింగ్ పరికరాల పనితీరును పరిశీలించారు. భౌతికంగా ఉన్న బాక్సుల సంఖ్యను సంబంధిత రికార్డులు, రిజిస్టర్లలోని వివరాలతో సరిపోల్చి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ, డిప్యూటీ ఎంపీడీవో ప్రభురావు తదితరులు పాల్గొన్నారు.