"బుల్డోజర్ పాలనా…న్యాయమైన పాలనా… ఏది కావాలి—కాకాణి"
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతా రెడ్డిపాలెం లోని ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి , మాజీ జిల్లా పరిషత్ చైర్పర్ పర్సన్ ఆనం అరుణమ్మ తో కలిసి నెల్లూరు నగర, రూరల్ కార్పొరేటర్ అభ్యర్థులకు 'బీ' ఫార్మ్ లను అందజేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి
- మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కి, చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి బీ ఫార్మ్ అందజేసిన కాకాణి
- నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది
- విత్‌డ్రాయల్స్ అనంతరం తుది జాబితా ప్రకటించగానే ప్రచారానికి సిద్ధమవుతున్నాం
- అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారు
- ఆర్వోలపై ఒత్తిడి తెచ్చి బలమైన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా చేశారు
- నామినేషన్ల తిరస్కరణతో సాధించిన ఏకగ్రీవాలు గొప్పతనం అనిపించుకోవు
- పోలీసులను, అధికారులను ప్రయోగించి అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారు
- ధైర్యం ఉంటే రాజకీయంగా నేరుగా పోరాడాలి.. దొంగదారులు తొక్కడం సరికాదు
- ఆనం విజయ్ కుమార్ రెడ్డి మేయర్ అభ్యర్థిత్వానికి ప్రజల్లో అపూర్వ స్పందన
- విజయన్నను ఎదుర్కొనే అభ్యర్థిని ఖరారు చేయడానికే టీడీపీకి ఆలస్యమైంది
- విజయన్న మేయర్ కావడం ఖాయం.. వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం
- అన్యాయంగా నామినేషన్ల తిరస్కరణకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- న్యాయపోరాటంతో పాటు ప్రైవేట్ కేసులు వేసి బాధ్యులయిన అధికారులను ప్రాసిక్యూట్ చేయిస్తాం
- దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడరు
- పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్‌సీపీని ఆపలేరు
- నెల్లూరు నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి
- బుల్డోజర్ పాలన కావాలా.. న్యాయబద్ధమైన పాలన కావాలా ప్రజలే నిర్ణయించాలి
- ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ని గెలిపించండి
- జగన్ నాయకత్వంలో మేయర్‌తో సహా నిలబడిన అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించేందుకు కృషి చేస్తాం.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, విత్ డ్రాల్ అన్నీ అయిపోయిన తర్వాత ,రేపటి నుంచి ప్రచారాన్ని నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నామని కాకాణి స్పష్టం చేశారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అధికార పార్టీ అనేక రకాలైన అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతోందని, మాకు సంబంధించిన వ్యక్తుల నామినేషన్లు స్వీకరించే దగ్గర నుంచి పరిశీలనలో కూడా అనేక రకాలైన కారణాలు చూపి, వాటిని తిరస్కరిస్తున్నాము అని చెప్పి దుర్మార్గంగా పక్కన పెట్టడం జరిగిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, ఏకగ్రీవాలు సాధించామని చెప్పుకునేటువంటి వాళ్ళు , మాకు సంబంధించిన పోటీలో ఉన్నటువంటి వ్యక్తులని దొంగతనంగా, అన్యాయంగా, అక్రమంగా వాళ్ళ పేర్లు జాబితా నుంచి తొలగించి నామినేషన్లు తిరస్కరించామని చెప్పి, మేము ఏకగ్రీవాలు సాధించాము అంటే అది గొప్పతనం అనిపించుకోదని హితవు పలికారు కూటమి నాయకులు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులపై గెలుపొందలేక, బలమైన అభ్యర్థులు ఉన్నచోట గెలవలేక ఆర్వోల మీద ఒత్తిడి తెచ్చి నామినేషన్లను తిరస్కరించేలా చేశారని కాకాణి ఆరోపించారు. నెల్లూరు నగరంలో విజయన్న మేయర్ అభ్యర్థిత్వాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినప్పటి నుంచే ప్రజల్లో అపూర్వమైన స్పందన వచ్చిందని, మంచి వ్యక్తిని సెలెక్ట్ చేశారని ప్రతిపక్షాలు సైతం అంటున్నాయని,, చివరికి లోకేష్ కూడా స్పందించారంటేనే నెల్లూరు నగరంలో ఆయన అభ్యర్థిత్వం ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చెప్పారు. విజయన్నని డీకొనే అభ్యర్థిని ఖరారు చేయడానికే మీన వేషాలు లెక్కించి, నామినేషన్ ముందు రోజు మేయర్ అభ్యర్థిని ఖరారు చేశారంటేనే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అర్థమైపోయిందని కాకాణి విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరిస్తోందని కాకాణి మండిపడ్డారు. ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా పోరాడాలని, ఇలా దొంగదారులు తొక్కి దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే విజయన్న, చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ వేసే అభ్యర్థులకు అండగా నిలిచారని, వైయస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని కాకాణి ఆరోపించారు. కూటమి నాయకులు పోలీసులను ఉసిగొల్పి, బెదిరింపులకు పాల్పడుతూ నామినేషన్లు రద్దు చేయిస్తున్నారని, బరిలో లేకుండా చేయాలని చూస్తున్నారని, మీకు దమ్ముంటే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలవాలని, అంతేకాని, చేతకాక, చావలేక, దొంగదారులు తొక్కితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చావుకైనా సిద్ధపడి పోరాడేవారే తప్ప, పిరికిపందల్లా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు,అన్యాయంగా నామినేషన్లు తిరస్కరించిన అధికారులపై, దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయ పోరాటం చేయడంతో పాటు ప్రైవేట్ కేసులు వేసి ప్రాసిక్యూట్ చేయిస్తామని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ అభ్యర్థులకు, బీఫారాల పంపిణీ జరిగింది. విజయ్ అన్న, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లకు కూడా బీఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, తెలిపారు రాసిపెట్టుకోండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని , విజయ్ అన్న మేయర్ కావడం ఖాయం అని కాకాణి స్పష్టం చేశారు. కూటమి నాయకులు మీ పరిపాలన మీద ప్రజల్లో నమ్మకం ఉంటే నేరుగా ఢీకొనాలి కానీ ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేయడం పిరికిపంద చర్య అని ,ధైర్యం ఉన్నటువంటి వాడు నేరుగా పోరాడి ఎన్నికలులో పోటీ చేస్తాడని , పిరికిపంద మాత్రమే దౌర్జన్యంగా ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ,మా వాళ్ళ మీద దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా అక్రమ కేసులు పెట్టి జైళ్ళకి పంపినా, అన్నిటికీ సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళమని, పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపాలని చూస్తే వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదని అన్నారు నేను నెల్లూరు నగర ప్రజలందరినీ కోరుకునేది, ఈరోజు మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయండి. రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు నగర భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. నెల్లూరు నగర ప్రజల ఆశయాల సాధన గురించి ఆలోచన చేయండి.నెల్లూరు నగరానికి కార్పొరేషన్ మేయర్ గా ఎవరు ఉంటే ప్రజలందరికీ మేలైనటువంటి వ్యవస్థ అందుతుంది, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారు, ఇబ్బందులు కాకుండా ఉంటారనేది ఆలోచన చేయాలని కోరారు మీకు బుల్డోజర్ పరిపాలన కావాలంటే, ఎవరి ఇళ్ల మీద కావాలంటే వాళ్ళ మీదకి బుల్డోజర్లు,ప్రొక్లైన్లు పోయేటువంటి సంస్కృతి కావాలంటే మీ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోవాలని, మీరు సుఖంగా, సంతోషంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందించాలంటే మాత్రం, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ని గెలిపించండి అని అందరిని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా, మేయర్ తో సహా అన్ని స్థానాల్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు,