BREAKING
ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు...ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ : గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్‌థాల్ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్): పవిత్ర నైవేద్యానికి దక్కిన విశిష్ట గౌరవం!

బ్రాహ్మణ చెరువులో మట్టి దోపిడీ!

Select Suryaa Now
బ్రాహ్మణ చెరువులో మట్టి దోపిడీ!
  •  జేసీబీ, మూడు ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలింపు అధికారులు వచ్చేసరికి పరారీ..
  • అండదండలపై అనుమానాలు!

భోగాపురం సూర్య: చెరువుల పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అధికారులు ఉన్నా.. అక్రమ మట్టి తరలింపును అడ్డుకునే నాథుడే కరువయ్యారా? భోగాపురం మండలం చాకివలస రెవెన్యూ పరిధిలోని బ్రాహ్మణ చెరువులో జరుగుతున్న మట్టి తరలింపు వ్యవహారం ఈ ప్రశ్నలకు తావిస్తోంది. జేసీబీతో పాటు మూడు ట్రాక్టర్లను ఉపయోగించి చెరువులోని మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో మట్టి తరలింపు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే సంబంధిత వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం సమీప ప్రాంతాల్లో జేసీబీ, ట్రాక్టర్ల కోసం గాలించినప్పటికీ అవి కనిపించక పోవడంతో అధికారులు వెనుదిరిగినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. అధికారులు వచ్చే సమాచారం ముందుగానే అందుతుందా? లేక వారి కదలికలను గమనిస్తూ మట్టి తరలింపునకు పాల్పడుతున్నారా? అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. * అక్రమాలకు అడ్డుకట్ట పడేనా? చెరువుల్లో మట్టి తరలింపునకు సంబంధించి నిబంధనలు పాటించాల్సిందేనని, ముందస్తు సమాచారం లేకుండా మట్టి తరలిస్తే సంబంధిత వ్యక్తులపై వాల్టా చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ హెచ్చరించారు. చెరువుల సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. బ్రాహ్మణ చెరువులో మట్టి తరలింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.