BREAKING
జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది! ప్రధాని మోడీ పేరు మీద రుద్రాభిషేకం

బియ్యం నిల్వల్లో భారీ తేడాలు

Select Suryaa Now
బియ్యం నిల్వల్లో భారీ తేడాలు

జగ్గయ్యపేటలోని రేషన్ షాపుల్లో డీఎస్‌వో ఆకస్మిక తనిఖీలు

బియ్యం నిల్వల్లో భారీ తేడాలు..
ఆరు షాపుల ఈ-పాస్ మెషీన్లు సీజ్
జగ్గయ్యపేట అక్టోబర్ 7 మేజర్ న్యూస్:
జగ్గయ్యపేట పట్టణంలోని రేషన్ షాపులపై ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి సత్యవాణి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి దాదాపు 10 రేషన్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలు షాపుల్లో బియ్యం బస్తాల నిల్వల్లో తేడాలు గుర్తించినట్లు సమాచారం. ఇద్దరు ముగ్గురు డీలర్లను తీవ్రంగా హెచ్చరించారు. ఆరు షాపుల్లో అవకతవకలు ఎక్కువగా ఉండటంతో ఈ-పాస్ మిషన్లను సీజ్ చేశారు. ఆ డీలర్లపై 6(a) కేసులు నమోదు చేయాలని స్థానిక తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీఎస్ ఓ తనిఖీలతో పట్టణంలోని రేషన్ డీలర్లలో వణుకు మొదలైంది. కార్డుదారులకు సరుకులు సక్రమంగా పంపిణీ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని సత్యవాణి హెచ్చరించారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

 

 

 

శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా