BREAKING
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం.. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు రూ 25 లక్షలు తో పినపల్ల లో అభివృద్ధి పనులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. సినిమాపై ప్రశంసల జల్లు! టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి.. టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత దసరా బాక్సాఫీస్ రేసులో 'రణబాలి' మరియు 'జైలర్ 2'.. పండగ విన్నర్ ఎవరో తేలేదిప్పుడే! ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..* పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా! అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ ఇంట్లో వైభవంగా దసరా నవరాత్రి పూజలు.. ప్రత్యేక ఫోటోలు పంచుకున్న దిల్ రాజు భార్య తేజస్విని!

భవానీ అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం

Select Suryaa Now
భవానీ అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు  దర్శనం

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్  :       నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు 'శ్రీ భవానీ' అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ విశేష భవానీ అలంకారానికి ఉభయకర్తలుగా మాగుంట సోదరులు వ్యవహరించారు. అనంతరం ఆలయంలో శాస్త్రోక్తంగా సంపుటీకరణ చండీ హోమం నిర్వహించగా, నెల్లూరుకు చెందిన ముంగమూరు శ్రీహరి రెడ్డి, రోహిణి దంపతులు ఉభయకర్తలుగా పూజల్లో పాల్గొన్నారు.  అమ్మవారి ఆలయ ప్రత్యేక పుష్పాలంకారానికి  కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సరిత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా, భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సాయంత్రం నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుజిత దంపతులు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ చైర్మన్  ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ ఉత్సవ కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి  శ్రీధర్ నాయుడు, ముఖ్య ఉత్సవ అధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీమతి ఏలూరు శిరీష పర్యవేక్షించారు.