BREAKING
జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది! ప్రధాని మోడీ పేరు మీద రుద్రాభిషేకం

బాల్య వివాహాల నుంచి విముక్తి

Select Suryaa Now
బాల్య వివాహాల నుంచి విముక్తి

 నగరం, మేజర్ న్యూస్ 

ఈ ప్రాంతంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి 2023 సంవత్సరం నాటికి బాల్య వివాహాల నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని ఏరేటిపాలెంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కేంద్ర మహిళా అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చి దిద్దేందుకు సంస్థ పని చేస్తుందన్నారు. బాల్య వివాహరహిత గ్రామాలుగా మార్చేందుకు తీర్మానించి, ఆ మేరకు ప్రతిజ్ఞ చేశారు. 2024 వ సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ -ఇండియా ప్రచారంతో ఉద్యమానికి మరింత ప్రభావం కనిపిస్తున్నందున, నిర్ణయించిన లక్ష్యసాధన సంవత్సరం కంటే ముందుగానే సాకారమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కె . రవి ప్రదీప్, కోఆర్డినేటర్ బడుగు కిషోర్, పంచాయతీ అభివృద్ధి అధికారి పి. వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్ జి. వరలక్ష్మి, వాలంటీర్లు శ్రీనివాసరావు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.