అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మా కార్యక్రమం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని తూర్పు ముస్లిం వీధి అంగన్వాడీ కేంద్రం లో శనివారం పోషణ్ మా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీడీపీఓ , సూపెర్వైజర్ ఆదేశాల మేరకు జాతీయ పోషణ మాసం 2026 లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమం కార్యకర్త సాలెహ ఘనంగా నిర్వహించారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్ధాలు ప్రదర్శించి తల్లికి సంపూర్ణ భోజనం ప్లేట్ ను అందించారు. ఈ కార్యక్రమం లో పలువురు గర్భిణీలు, బాలింతలు, మహిళలు , తల్లిదండ్రులు పాల్గొన్నారు.