అంబేద్కర్ గ్రంథాలయం నిర్మాణమే తొలి అడుగు.. ఆపై కాంస్య విగ్రహ ప్రతిష్ఠ!
(అనంతపురం న్యూ టౌన్ రిపోర్టర్ తిరుపతి సురేష్)
గుంతకల్లు పట్టణ నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం స్థానంలో ముందుగా అంబేద్కర్ గ్రంథాలయాన్ని నిర్మించి, అనంతరం తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి గ్రంథాలయ నిర్మాణానికి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణను మరోసారి కలిసి నిధులు కోరాలని, నిధులు అందకపోతే ప్రజల సహకారంతో చందాలు సేకరించి గ్రంథాలయాన్ని నిర్మించాలని తీర్మానించినట్లు నాయకులు తెలిపారు.
తొమ్మిది అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అందిస్తున్న శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం, ఇందుకు కృషి చేసిన గుమ్మనూరు నారాయణస్వామికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వివిధ దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.