BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

అలుపెరగని యోధుడు.. ప్రజల ఆత్మబంధువు నంద్యాల వరదరాజు రెడ్డి

Select Suryaa Now
అలుపెరగని యోధుడు.. ప్రజల ఆత్మబంధువు నంద్యాల వరదరాజు రెడ్డి

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : అలుపెరగని రాజకీయ యోధుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి కి మాడెం సుధాకర్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల రాజకీయ అనుభవంతో ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు నంద్యాల వరదరాజు రెడ్డి అని మాడెం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రభావంతో పేరుపొందిన ప్రొద్దుటూరు ప్రాంతంలో ఫ్యాక్షన్ నిర్మూలనకు కృషి చేసిన నాయకుడిగా, పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తనవంతు పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అలుపెరుగని పోరాట పటిమతో ప్రజల మధ్య ఉంటూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ప్రొద్దుటూరు ప్రజలకు పెద్దాయనగా, అందరి ఆత్మబంధువుగా అభిమానాన్ని సంపాదించుకున్న నంద్యాల వరదరాజు రెడ్డి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని, ప్రతి జన్మదిన వేడుకను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాడెం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా