అక్టోబరు నెల మల్లన్న దర్శనం, ఆర్జిత సేవలు టికెట్లు విడుదల
అక్టోబరు మాసానికి సంబంధించి మల్లన్న స్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం, ఆర్జితసేవా టికెట్లను శుక్రవారం విడుదల చేసినట్టు శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఏపీటీఎస్ వారి వెబ్సైట్ www.tms.ap.gov.in లేదా ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందే అవకాశం ఉందన్నారు. టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందువరకు కూడా ఆర్జిత సేవా టికెట్లు పొందే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు, ఉత్సవాల సందర్భంగా దర్శనాల విషయంలో పలు మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.