BREAKING
మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మునక ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

‎ప్రజలు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

‎

‎‎ఏలూరు, వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు శుక్రవారం రోజు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఎల్ నినో ప్రభావంతో గత మూడు నాలుగు నెలలుగా భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రస్తుత వర్షాలు రైతులకు పంటలకు ఎంతో ఉపయోగకరమైనవి అయినప్పటికీ, భారీ  వర్షాలు వరదలతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఎంపీ తెలియజేశారు. ఏలూరు పట్టణంలోనూ, జంగారెడ్డిగూడెంలోను రెండు కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారని, ప్రజలు అత్యవసర ఆపద సమయంలో ఆ కంట్రోల్ రూమ్ లకు సమాచారం ఇస్తే అధికార యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున  అత్యవసరమైతే తప్ప ప్రజలు రెండు రోజులు ఇంటి నుంచి బయటికి రావద్దని కోరారు. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గ పరిధిలో వివిధ కాలువలు, ప్రాజెక్టులలో నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట్ల అధికారులు సహాయ చర్యల్లో పాల్గొనాలని ఎంపీ కోరారు. ఆపదలో అవసరమైతే తన కార్యాలయాన్ని (ఎంపీ కార్యాలయ ఫోన్ నెంబర్లు.. 9515225125, 9885519299)  సంప్రదించవచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.