అభివృద్ధి విజయానికి శ్రీరామరక్ష - అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన మంత్రి పార్థసారథి
నూజివీడు, మేజర్ న్యూస్ : గతంలో ఎన్నడూ లేని విధంగా నూజివీడు పురపాలక సంఘం పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. చేసిన అభివృద్ధి పనులే పురపాలక సంఘం ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి శ్రీరామ రక్షా అని అన్నారు. బుధవారం నాడు నూజివీడు మున్సిపల్ ఎన్నికలు వార్డు కౌన్సిలర్లు బరిలో నిలిచిన36మంది కూటమి అభ్యర్థులకు మంత్రి కొలుసు పార్థసారథి అధికారిక ‘బి-ఫామ్’లను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూజివీడు పట్టణ పరిధిలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను డోరు టూ డోరు వెళ్ళి, ప్రతి ఓటరును కలిసి మద్దతును కూడగట్టాలని సూచించారు. నూరుశాతం గెలుపుతో పాటు భారీమెజార్టీలు సాధించి, రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. సమయం చాలా విలువైనది అని అభ్యర్థులు ప్రచారంలో వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కౌన్సిలర్ల అధికారిక అభ్యర్థులు, వార్డునాయకులు, కార్యకర్తలు,అభిమానులు సమన్వయంతో పనిచేసి అన్ని వార్డులలో కూటమి అభ్యర్థులను భారీమెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు నియమావళికి లోబడి విస్తృత ప్రచారాలు నిర్వహించాలని, ప్రజలు సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగాలని అభ్యర్థులకు మంత్రి కొలుసు పార్థసారథి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్-చైర్మన్, నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోటీలో ఉన్న అధికారిక కౌన్సిలర్లు అభ్యర్థులు, ముఖ్యనాయకులు, పట్టణ ప్రముఖులు, వార్డు నాయకులు, కూటమినాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.