BREAKING
వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు పీఎం ఈ-విద్య శిక్షణ పూర్తి చేసిన ఉపాధ్యాయులు కరెంటు కోతలతో ఎండిన వరి పంట.. ఆదుకోవాలని రైతు వేడుకోలు తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి తెలంగాణ అభివృద్ధి వరకు కేసీఆర్ చెరగని ముద్ర పోరాటం కొనసాగిస్తాం కలెక్టర్ ను సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి... బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎన్టీఆర్ పునాది. కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు – రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉరవకొండపై నివేదిక

అభివృద్ధే లక్ష్యంగా కూటమి అడుగులు: సబ్బవరంలో రూ.2.20 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Select Suryaa Now
అభివృద్ధే లక్ష్యంగా కూటమి అడుగులు: సబ్బవరంలో రూ.2.20 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

పెందుర్తి ,మేజర్ న్యూస్ : పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఆరిపాక, అంతకాపిల్లి గ్రామాలలో రూ. 2 కోట్ల 20 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ గండి బాబ్జి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ చొక్కాకుల వెంకటరావు ముఖ్య అతిథులుగా పాల్గొని పనులను ప్రారంభించారు.

ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతూ గొటివాడ శ్రీ దామోదర లా కాలేజ్ నుండి ఆరిపాక వరకు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి 'సేవ సంకల్ప యాత్ర'ను నిర్వహించారు. అనంతరం రాములమ్మపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చుక్కాకుల వెంకటరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సభలో స్థానిక కూటమి నేతలు అతిథులను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంతకాపల్లి పంచాయతీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, రాబోయే రోజుల్లో చేపట్టబోయే పనుల వివరాలను ప్రజలకు వివరించారు. కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వెచ్చించడం అభినందనీయమని స్థానిక నేతలు కొనియాడారు.

ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో తప్పు జరగదని స్పష్టం చేశారు. గత ఎంపీ పాలనతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎంపీ సీఎం రమేష్ అందిస్తున్న ప్రోత్సాహంతో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి పాటుపడే నాయకులను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి పాలనను మరువకుండా కూటమికి పట్టం కట్టిన ప్రజలకు తామెల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. పారిశ్రామిక పరంగా జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజ, తహశీల్దార్ చంద్ర, యువ నాయకులు గండి వంశీ, మాజీ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, బీజేపీ జనరల్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, సీనియర్ నాయకులు బర్నకాన బాబురావు, వనం సత్యనారాయణ, డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు, మిడతాన మహాలక్ష్మి నాయుడు, ఇందల రమణ, సాలాపు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు, గండి ముత్యాల నాయుడు ఇతర ప్రజాప్రతినిధులు, ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.