ఆటో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు మరింత బలపడాలి – వెల్దుర్తి AITUC మండల సమితి శుభాకాంక్షలు
వెల్దుర్తి, ప్రతినిధి సూర్య మేజర్ న్యూస్ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా వెల్దుర్తి AITUC మండల సమితి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
కర్నూలు జిల్లా ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో ఏపీ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కర్నూలు జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మునిస్వామి / లెనిన్ బాబుల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. గణేష్, జిల్లా అధ్యక్షుడు ఎం. మధు, సహాయ కార్యదర్శులు భీమరాజు, యేసయ్యలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వెల్దుర్తి ఏఐటీయూసీ మండల నాయకులు మాట్లాడుతూ... నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం కావాలని, కార్మికుల హక్కుల రక్షణకు యూనియన్ బలమైన వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ఏపీ ఆటో యూనియన్ నేతృత్వంలో కార్మిక సంక్షేమం మరింత అభివృద్ధి చెందాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల సమితి నాయకులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా