ఆత్మకూరులో తొలిరోజు 5 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలో జరుగునున్న ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో పోటీకి గాను ఐదు మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురు వై సి పి తరఫున, ఒకరు తెలుగుదేశం తరఫున నామినేషన్లు దాఖలు చేశారు అని రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ టి.సోమయ్య, ఎంపీడీవో పి. రఫీ ఖాన్ లు తెలిపారు. వాసిలి ఎంపిటిసి స్థానానికి తెలుగుదేశం తరఫున మామిడి చందన నామినేషన్ దాఖలు చేశారు. మహిమలూరు ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున చామనబోయిన లక్ష్మీదేవి, చామనబోయిన సుజాత నామినేషన్ దాఖలు చేశారు. అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున గంటా సునీత, మామిళ్ళ రుక్మిణమ్మలు తమ నామినేషన్లను దాఖలు చేశారు.