ఆరు నామినేషన్లు తిరస్కరణ
రేగిడి, సూర్య : మండలం లో 20 ఎంపిటిసి లకు సంబంధించి దాఖలు చేసిన నామినేషన్ల లో ఆరు నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి మన్మధ రావు వెల్లడించారు.గత మూడు రోజులు పాటు జరిగిన నామినేషన్ల ప్రక్రియ లో 104 నామినేషన్లు దాఖలయ్యాయని వీటిని శనివారం పరిశీలించగా అందులో లక్ష్మి పురం ప్రాదేశికం నుండి మీసాల చంద్రరావు, లింగాల వలస నుండి పొగిరి క్రిష్ణంనాయుడు,తునివాడ నుండి బలగ నిర్మల,ఉనుకూరు నుండి పోరాపు ధనలక్ష్మి, అంబఖండి నుండి లావేటి శ్రీనివాసరావు, యవర్న రామారావు లో నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణ కు గురైనట్లు తెలిపారు.వీటితో పాటు మరో ఏడు నామినేషన్లు డబుల్ వేయడంతో వాటిని తొలగించబడ్డాయని మొత్తం 13 నామినేషన్లు చెల్లుబాటు కాలేదని 91 నామినేషన్లు ఆమోదించబడ్డాయన్నారు.
రిపోర్టర్ : రాము నాయుడు, రేగిడి, విజయనగరం జిల్లా.