BREAKING
గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్!

సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీటీవీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేయాలి.. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి ప్రశాంతి, ఐఏఎస్..

Select Suryaa Now
సమస్యాత్మక,  పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీటీవీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేయాలి..    జిల్లా ఎన్నికల పరిశీలకురాలు     పి ప్రశాంతి, ఐఏఎస్..

ముమ్మిడివరం మేజర్ న్యూస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ఆయా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఇందిరాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం జెడ్పీ సీఈఓ కార్యాలయం, కె. గంగవరం, ఐ. పోలవరం మండలాల్లోని సంబంధిత కార్యాలయాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఐ. పోలవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సమకూర్చుకోవాలని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పర్యటనలో హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బి. రమణ, ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ రవివర్మ, ముమ్మిడివరం తహసీల్దార్ టి. సుభాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.