ఆర్ అగ్రహారం విద్యా కమిటీ చైర్ పర్సన్ గా కావేరి
రేణిగుంట: మండలంలోని ఆర్. అగ్రహారం పాత రేణిగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ చైర్ పర్సన్ గా కావేరి, వైస్ చైర్ పర్సన్ గా మునీశ్వరి ఎన్నికయ్యారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సింగిల్ విండో చైర్మన్ వీరాపురం భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గజేంద్ర రెడ్డి, యూత్ సభ్యులు డి.జనార్దన్ రెడ్డి,రామ్ రాజ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ఎన్నిక ప్రక్రియ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.