ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజీ కాలేదు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము రాజీ కాలేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. శనివారం ఆళ్లగడ్డ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే తమ పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుందని ఎన్నికలకు పోలేక ఇంట్లో కూర్చొని వైకాపా వారు రాజకీయాలు చేశారని విమర్శించారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హాయంలో ఎంపీటీసీలు రెండు శాతం ఏకగ్రీవాలు కాగా, 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24% ఏకగ్రీవాలు అయ్యాయని ఆమె గుర్తు చేశారు. 2014లో జడ్పిటిసిలు ఒకటి మాత్రమే ఏకగ్రీవం అయ్యాయన్నారు. 2020లో 19% జడ్పిటిసిలు ఏకగ్రీవo అయ్యాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కడప జిల్లాలో ఎంపీటీసీలు 79 శాతం, జడ్పీటీసీలు 76% జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవం అయ్యాయని వైసిపి వారు దీనికి ఏం సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు. నాటి వైసిపి సోషల్ మీడియాలో అప్పటి కథనాలు నేటికీ అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. నిమ్మగడ్డకు రాజకీయాలు కావాలా.? గ్రామ స్వరాజ్యం అంటే ఏకగ్రీవాలు కావాలని నాటి సోషల్ మీడియాలో మీరు ప్రచురించటం నిజం కాదా అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏకగ్రీవాలు అయితే ప్రతి గ్రామానికి రూ. 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నిధులను కాజేసింది నాటి వైసిపి ప్రభుత్వం అన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనన్నారు రాష్ట్రంలోనీ ఎంపీటీసీలు 9829 స్థానాలకు గాను 32095 నామినేషన్లు దాఖలు కాగా, అందులో టిడిపి 15012, వైసిపి 12419 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. జెడ్ పిటిసి లు 659 కాగా మొత్తం నామినేషన్లు 2805 వచ్చాయని అందులో వైకాపా 1092, టిడిపి 1058 దాఖలైనట్లు తెలిపారు. కేంద్రం డిసెంబర్ నెలలో మన రాష్ట్రానికి 12000 కోట్లు రావలసిన నిధులను రాకుండా అడ్డుకునేందుకు వైసిపి కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకోవాలని వారు కోరారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని వాటిని జరగనివ్వకూడదని ఉద్దేశంతోనే వైసిపి కపటనాటకాలు ఆడుతున్నట్లు తెలిపారు. ఆళ్లగడ్డ విషయానికొస్తే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితం పై అందరు ఆశ్చర్యపోతున్నట్లు అన్నారు. ఆళ్లగడ్డ ఎక్కడ కూడా రాజీ కాలేదని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని 32 వార్డులలో వైసీపీ వారు అన్నిటికీ నామినేషన్లు వేయగా పరిశీలనలో ఐదు నామినేషన్లు తొలగించబడినాయి అన్నారు. దీంతో వారు గెలుపు సాధ్యం కాలేదనుకుని తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీంతోమున్సిపాలిటీ పీఠాన్ని టిడిపి కైవసం చేస్తుందని అన్నారు. రాజీమార్గం అంటే చైర్మన్ ఒక పార్టీకి, వైస్ చైర్మన్ మరొక పార్టీకి దక్కుతుందని ఇక్కడ అన్ని పదవులు తెలుగుదేశం పార్టీకి దక్కాయన్నారు. ఓటమి భయంతోనే వైకాపా నామినేషన్లు ఉపసంహరించుకున్నారని, తమ నాయకత్వం ఉన్నంతవరకు ఆళ్లగడ్డలో రాజీ ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజీమార్గంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్నారు. వైసిపి ప్రభుత్వంలో తాము కాంప్రమైజ్ కాకుండా పోటీ చేసి మూడు స్థానాల్లో గెలుపు సాధించిన అంశాన్ని వారు గుర్తు చేశారు. ఐదు ఓట్ల లోపు స్వల్ప తేడాతో ఐదు కౌన్సిలర్ స్థానాలను అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నుంచి చేజారినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఐదు వేల ఆధిక్యం వచ్చిన అంశాన్ని ఆమె గుర్తు చేస్తూ అదే తరహాలోనే ఇప్పుడు మున్సిపాలిటీలో విజయం సాధించినట్లు తెలిపారు. ఆళ్లగడ్డలో తెలుగుదేశం వారు అరాచకాలు చేశారని వైకాపా వారు విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నాలుగు రోడ్ల కూడలిలో అన్యాయం జరిగిందని ధర్నా చేయడం సబబు కాదన్నారు. తమ పార్టీకి చెందిన వారిని దూషిస్తూ అధికారంలోకి తాము వస్తే అంతు చూస్తామనటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఉన్నత స్థాయిలో హుందాతనంగా రాజకీయాలు చేయాలని మాజీ ఎమ్మెల్యే వీధి రౌడీల ప్రవర్తించడం ఏమిటని ఆమె విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను దూషించిన వైసీపీ మాజీ కౌన్సిలర్ ను మీరు ఎలా వెనకేసుకువస్తారని అడిగారు. ఏదో జరుగుతుందని సృష్టించడానికి ఎవరు రాళ్లు వేయకపోయినా వేసినట్లుగా చిత్రీకరించారన్నారు. వైకాపా వారు భయంతోనే నామినేషన్లు వేయలేదని అంశం వాళ్ల నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసని ఆమె అన్నారు. కావాలనే గొడవలు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి వైసిపి పార్టీ శ్రేణులను అన్నిచోట్ల పోటీలో ఉండాలని ఆదేశించారన్నారు.