BREAKING
కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

ఆదర్శ గ్రామంగా ఉల్లిభద్రను తీర్చిదిద్దుతా..! గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఏకగ్రీవ సర్పంచ్ మరడాన వాసవికుమారి

Select Suryaa Now
ఆదర్శ గ్రామంగా ఉల్లిభద్రను తీర్చిదిద్దుతా..!  గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా  ఏకగ్రీవ సర్పంచ్ మరడాన వాసవికుమారి

ఏకగ్రీవ ఎన్నికతో పెరిగిన బాధ్యత.. 'ముఖాముఖి'లో స్పష్టీకరణ

గరుగుబిల్లి, నవంబర్ 28, మేజర్ న్యూస్: రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఒక్కటై తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా నని, ఉల్లిభద్ర గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నూతన ఏకగ్రీవ సర్పంచ్ మరడాన వాసవికుమారి స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఇది నా వ్యక్తిగత విజయం కాదు గ్రామ ఐక్యతకు నిదర్శనం.ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని సర్పంచ్ వాసవికుమారి వెల్లడించారు. ఎంపీపీ మరడాన నారాయణస్వామి సతీమణి అయిన వాసవికుమారి గ్రామస్తుల ఏకగ్రీవ మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేక 'ముఖాముఖి'లో తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు.

ప్రశ్న: గ్రామస్తులందరూ మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై మీ స్పందన ఏమిటి?

జవాబు: ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.ఎన్నికల గొడవలు లేకుండా గ్రామ అభివృద్ధి కోసమే గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు ఏకమై నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ విజయంనాపై మరింత బాధ్యతను పెంచింది.ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తాను.

ప్రశ్న:సర్పంచ్‌గా మీరు చేపట్టబోయే తొలి ప్రాధాన్యత పనులు ఏమిటి?

జవాబు: గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే నా మొదటి లక్ష్యం.ముఖ్యంగా అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను.

ప్రశ్న:ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలా ముందుకు వెళ్తారు?

జవాబు: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను. పింఛన్లు, గృహ నిర్మాణం, ఇతర ప్రభుత్వ ఫలాలు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ అందేలా చూస్తాను. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే ప్రత్యేక ప్రోత్సాహక నిధులతో పాటు ఎంపీపీ మరడాన నారాయణస్వామి సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చే గ్రామాభివృద్ధికి వ్యయం చేస్తాను.


ప్రశ్న: మహిళలు, యువత అభివృద్ధికి మీ ప్రణాళికలు ఏమిటి?

జవాబు: మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తాను. అలాగే గ్రామంలోని యువతకు క్రీడా ప్రాంగణం, విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను.

ప్రశ్న: గ్రామస్తులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

జవాబు: ఏకగ్రీవ ఎన్నికతో ఉల్లిభద్ర ఐక్యతను చాటింది. రానున్న రోజుల్లోనూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.మీ సమస్యలు ఏవైనా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. అందరి సహకారంతో ఉల్లిభద్రను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతాను.