ఆడపిల్లను కాపాడుకుందాం
- కారుణ్య చైర్మన్ జె సి రాజు.
బొబ్బిలి, సూర్య: ఆడపిల్లకు భద్రత,సంరక్షణ నిస్తూ వారిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జె సి రాజు అన్నారు. ఆదివారం కారుణ్య కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ నేపధ్యంలో అవగాహన సమావేశం సంస్థ ఉపాధ్యక్షులు నాగురు రమేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లను పుట్టనిద్దాం , బ్రకనిద్దాం, ఎదగనిద్దాం, చదనిద్దాం అంటూ గోడ పత్రికలను ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ జె సి రాజు మాట్లాడుతూ బాల్యవివాహాలు ను అరికట్టి ,బాలికల హక్కులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. బాలికలు ఉండే ప్రతిష్టలంలో వారికి భద్రతనివ్వాలన్నారు.బాలికా విద్యకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. లింగ అసమానతలు లేకుండా తల్లితండ్రులు,సమాజం అవగాహన కలిగి ఉండాలన్నారు కార్యక్రమంలో సబ్యులు రమేష్, రామకృష్ణ, శర్మ, రాజు,చిన్నారావు, తదితరాలు పాల్గొన్నారు.