44వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా హర్షిత రెడ్డి
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 44వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిగా హర్షిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శనివారం స్థానిక కన్నయ్య నాయుడు కాలనీ స్వర్ణ సచివాలయంలో నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం, చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్ మోహన్ ఆశీస్సులతో, స్థానిక నాయకుల సహకారంతో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తనకు వైకాపా కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కల్పించిన చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జి విజయానంద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 44వ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హర్షిత రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.