BREAKING
తాగునీరు ,సాగునీటికి తప్పని తిప్పలు! పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి

3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జయలక్ష్మి జోరుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జయలక్ష్మి జోరుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

3వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి జయలక్ష్మిజోరుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటోంది. 3వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముందుగా డివిజన్‌లోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు, మద్దతు పొందారు. అనంతరం కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఎన్నికల్లో విజయం సాధిస్తే అభివృద్ధికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. మాటలు చెప్పే నాయకుడిని కాదని, చేతల్లో చూపించే ప్రజాప్రతినిధిగా పని చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాసులకు కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు  సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని జయలక్ష్మిడివిజన్ ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి