377వ గాయత్రి హోమం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా పరాభవ నామ సంవత్సర ఆశ్వీజ మాసము రెండవ రోజు సోమవారం హేమ విట్టలేశ్వర స్వామి దేవస్థానం లో గాయత్రి పీఠంలో అల్లం కిరణ్ కుమార్ వసంత గారి దంపతులచే 377వ గాయత్రి హోమం కుర్ర రామారావు ఆధ్వర్యంలో గాయత్రీ పరివార్ సభ్యులచే భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. కార్యక్రమంలో కౌతరపు పద్మావతి, పెనుగొండ నాగరాజ కుమారి, తూనుగుంట్ల ఝాన్సీ రాణి, అల్లం జస్వంత్, అల్లం జాహ్నవి, నరసమ్మ రాణి తదితరులు పాల్గొన్నారు.