BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

22 ఏ జాబితా నుండి 5700 ఎకరాలకు విముక్తి -- జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి

Select Suryaa Now
22 ఏ జాబితా నుండి 5700 ఎకరాలకు విముక్తి    -- జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి

ఏలూరు, సూర్య న్యూస్ :  ఏలూరు జిల్లాలో 5,700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి  5,937 మంది రైతులకు లబ్ది చేశామని రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్  చెప్పారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో  గురువారం జిల్లా సమీక్షా సమావేశం అనంతరం   22ఏ జాబితా నుండి భూములను తొలగించిన రైతులకు ఉత్తరువులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ 22ఏ  జాబితా నుండి జిరాయితీదారుల భూముల తొలగింపునకు  రాష్ట్రంలోనే  ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు.  ఏలూరు జిల్లాలో తీసుకున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ముఖ్యమంత్రి అమలు చేసారన్నారు. ఏలూరు జిల్లాలో పలుమార్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి  ఇంతవరకు 5700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి,  5937 మంది రైతులకు లబ్ది కలిగిందన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ కారణంగా తమ భూ సమస్యలకు విముక్తి కలిగిందని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు.  జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న, రమణ లను, రెవిన్యూ అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, డా.కామినేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న,  అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, ఆర్డీఓ లు లక్ష్మిప్రసన్న, రమణ, ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు,  వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము. జిల్లా ఇన్చార్జి ఏలూరు, పశ్చిమగోదావరి