BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

12న తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ పర్యటన

Select Suryaa Now
12న తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ పర్యటన

విజయవాడ:ఈ నెల 13న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఆయన సమావేశం కానున్నారు. తెలుగు గంగ ఒప్పందం ప్రకారం తమిళనాడుకు రావాల్సిన కృష్ణా జలాల వాటా సక్రమంగా అందడం లేదనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒప్పందం ప్రకారం ఏపీ నుంచి తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి సరఫరాలోని వ్యత్యాసాలు, వాటి పరిష్కారంపై సీఎం చంద్రబాబుతో ఆయన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ఈ రాజకీయ, అధికారిక భేటీలతో పాటు విజయవాడ వేదికగా ఘనంగా జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' వేడుకల్లోనూ సీఎం విజయ్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పర్యటనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ కార్యాలయం నుంచి ఇంకా అధికారిక షెడ్యూల్ వెలువడాల్సి ఉంది.