11వ వార్డు లో ప్రజా సమస్య లు పరిష్కారమే లక్ష్యం
సాగర్ నగర్, సూర్య : జీవీఎంసీ 11వ వార్డు పరిధిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి. మా దు రాజాబాబు. వార్డు అధ్యక్షుడు గుడ్ల పోల్ రెడ్డి .ఆధ్వర్యంలో విస్తృతంగా వార్డులో శనివారం ఉదయం సాగర్ నగర్. సుభాష్ నగర్. తాటి చెట్ల పాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో తాను గెలిపిస్తే వార్డులోకి నెలకొన్న సమస్యలను పరిరక్షించేందుకు నిరంతరం చేస్తానని హామీ ఇచ్చారు వార్డులో ప్రధానంగా తాగునీటి సమస్య వీధి దీపాల సమస్యలు కాలువలు నిర్వహణ వంటే అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని. మా దు రాజబాబు అన్నారు వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్య దిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి అందిస్తానని హామీ ఇచ్చారు గత మూడేళ్లుగా వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై ఇక భారం పడుతుందని విమర్శించారు పెరుగుతున్న ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వార్డులో తనను గెలిపిస్తే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి నిరంతరం ప్రజల మధ్య ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీనియర్ నాయకులు చెన్నా దాస్. పిల్లల రాజు. ఉప్పులూరి గోపి( నెంబర్ గోపి). గుంట బాలకృష్ణ. అభిరామ్. చల్లా శ్రీనివాసరావు. భాస్కర్ రావు. వైఎస్ఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు.
రిపోర్టర్ : ప్రకాష్, సాగర్‌నగర్, విశాఖపట్నం.