11వ డివిజన్ కార్పొరేటర్ గా జ్యోత్స్న ఏకగ్రీవంగా ఎన్నిక...
తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ లో 11వ డివిజన్ కార్పొరేటర్ గా జ్యోత్స్న ఏకగ్రీవంగా ఆదివారం గెలుపొందడం జరిగింది. ఆమె భర్త శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ఉన్న బి శ్రీధర్ వర్మ. తన సతీమణి ఏకగ్రీవంగా గెలుపొందినందుకు కృషి చేసిన సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 11వ వార్డును తిరుపతి కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు, స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జే.బీ శ్రీనివాస్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి
లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
H. ద్వారక, స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి, cell no :
9705347341