బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 03:46 PM
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 ప్రకారం ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జగిత్యాలలోని పలు స్కానింగ్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్కానింగ్ మిషన్స్, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్ కూడా పాల్గొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.