|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 08:04 PM
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి అలయ విస్తరణ పనుల జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన ఆయలంలో దర్శనాలను నిలిపివేశారు. రాజన్న దర్శనం ఇక నుంచి ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో.. రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లోనే భక్తులు దర్శనం చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక కోడె మొక్కలు భీమేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తాజాగా తెలిపారు. ఈ నేథ్యంలో రాజన్న ఆలయం గురించి ఓ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజన్న గుడిలోని దర్గాను తొలిగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గాను తొలగిస్తున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా ఏళ్లుగా హిందువులు చేస్తున్న పోరాటం ఫలించిందని చెబుతున్నారు. ఇది మంచి పరిణామని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. దర్గాను వేరే చోటుకు తరలించడానికి ముస్లిం వర్గం, ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ముస్లిం వర్గాన్ని ఒప్పినట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు రవీందర్ గౌడ్ అనే వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దర్గా హఠావో.. వేములవాడ బచావో..
ఈ ఏడాదిలో మార్చిలో ఆలయ ప్రాంగణం నుంచి దర్గాని తీసేయాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ మేరకు దర్గాను తొలగించాలంటూ హుండీలో చీటీలు రాసి వేశారు కొందరు భక్తులు. ఆ చీటీల్లో 'దర్గా హఠావో.. వేములవాడ బచావో' అని రాసి ఉంది. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా.. ఈ చీటీలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అప్పట్లో లేడీ అఘోరీ ఆలయానికి వెళ్లి దర్గా తొలగించాలంటూ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హుండీలో వచ్చిన చీటీల్లో దర్గా హఠావో..వేములవాడ బచావో చీటీలు హాట్ టాపిక్ గా మారాయి.
హిందూ భక్తుల ఆగ్రహానికి కారణం ఏంటి?
హిందూ భక్తుల ఆగ్రహానికి వివిధ కారణాలు ఉన్నాయి. అందులో ప్రచారంలో ఉన్న ఓ కథ ప్రకారం.. వేములవాడలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి వందలాది హిందువులు వచ్చేవారు. నిత్యం అభిషేకాలతో శివలింగాన్ని పూజించేవారు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన హజరత్ ఖాజ తన బలగాలతో.. హిందూ భక్తులపై దాడి చేశాడు. హిందువులు పరమపవిత్రంగా పూజించే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడు. అలాంటి కీచకుడిని శివభక్తులు చంపేశారు.
ఈ విషయం తెలుసుకున్న నిజాం పాలకులు.. వేములవాడలో హిందువులను విచక్షణా రహితంగా చంపేశారు. మహిళల మానప్రాణాలు చెరపట్టారు. అనంతరం హజరత్ ఖాజ మృతదేహాన్ని.. శివలింగానికి ఎదురుగా పాతిపెట్టారు. సమాధి కట్టి హజరత్ బాబ ఖాజ దర్గాగా మార్చారు. శివలింగాన్ని దర్శించుకునే హిందువులందరూ ముందుగా.. ఆ హజరత్ ఖాజను దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. కాలక్రమేనా ఆ ఆంక్షలే కొనసాగుతూ వచ్చాయని స్థానికులు చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కాగా.. గత కొన్నేళ్లుగా ఆ దర్గాని ఆలయం ప్రాంగణం నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.