|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 11:59 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం, పాపిరెడ్డి కాలనీ పరిధిలోని RGK కాలనీలో మహిళలు నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఆర్జీకే కాలనీ మహిళలు శ్రీమతి రామాదేవి, స్వరూప, అనిత, ఆశా మారుజులు ఉత్సాహంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు *మారబోయిన రవి యాదవ్ గారు* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ,సంక్రాంతి వంటి పండుగలు మన సంస్కృతి,* *సంప్రదాయాలను కాపాడుతూ, మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తాయని అన్నారు.*ముగ్గుల పోటీలు మహిళల* *సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతిలను రవి యాదవ్ స్వయంగా అందజేశారు.అదేవిధంగా, పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి పండుగ కానుకలు కూడా అందజేసి, వారందరినీ హృదయపూర్వకంగా అభినందించారు.ఈ కార్యక్రమం పండుగ వాతావరణంతో పాటు మహిళల ఉత్సాహం, ఐక్యతను ప్రతిబింబిస్తూ ఆనందోత్సాహాలతో కొనసాగింది.ఈ కార్యక్రమంలో సాయి నందన్ ముదిరాజ్, పవన్, రాంబాబు, శివాజీ, శ్రీకాంత్ యాదవ్,ఆర్.జమ్మయ్య, కృష్ణ ముదిరాజ్, తదితరాలు పాల్గొన్నారు.