|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 07:24 PM
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరైనా మద్దతు తెలిపితే స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేన ఒక రాజకీయ పార్టీ అని, ఆ పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు.హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి గులాబీ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని ఆయన గుర్తు చేశారు.మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతామని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీలు వారి నివాసాల్లో సమావేశం కావడంలో తప్పులేదని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా సమావేశం అయ్యారనే విషయంపై తనకు సమాచారం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెడతారో లేదో తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.