|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 10:40 AM
తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్, మెదక్ వంటి ప్రాంతాల్లో నిన్నటి కంటే ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం, రాత్రిపూట సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాచలంలో 19 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, ఏపీలోని చిత్తూరు, తిరుపతి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.