|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 05:48 AM
కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు. నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె గత కొంతకాలంగా మాతా శిశు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.మొదటి కాన్పు కోసం ఆమె నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెను పరీక్షించి, ఉమ్మనీరు తగ్గిన అనంతరం సోమవారం మధ్యాహ్నం శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. ఆడబిడ్డ జన్మించిందని, తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన నగరపాలక సంస్థ కమిషనర్ దంపతులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు.