GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 02:16 PM
భోగి పండుగ రోజున తెల్లవారుజామున పాత కర్రలు, పుల్లలు, పిడకలు, కొబ్బరి మట్టలతో పెద్ద మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేయడం ద్వారా పాత అలవాట్లు, చెడు ఆలోచనలను కూడా విడిచిపెట్టి కొత్త జీవనానికి అడుగుపెడతామని దీని అర్థం. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగి మంట వేయడం వల్ల సామూహిక ఐక్యత ఏర్పడుతుంది. భోగి రోజున పిల్లలకు తలంటు స్నానం చేయించడం, నువ్వుల నూనెను బ్రహ్మరంధ్రంపై రాసి, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించడం వల్ల చైతన్యం కలుగుతుందని పెద్దల నమ్మకం.