|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 11:31 AM
హైదరాబాద్ – మేడ్చల్ జిల్లాకు చెందిన రాజేష్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వరంగల్ ప్రాంతానికి చెందిన అనితారెడ్డి అనే మహిళ. గతంలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేసి మానేసి, ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న అనితారెడ్డి. తాను చేసిన రూ.5 లక్షల అప్పు వల్ల తరచూ బాధపడుతున్న భర్తను చూసి, అప్పు ఎలాగైనా తీర్చాలని అనితారెడ్డి నిర్ణయం. దీంతో చైన్ స్నాచింగ్ చేద్దామని మియాపూర్ ప్రాంతానికి చెందిన నల్ల కమల అనే మహిళ మెడలో ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నం. లిప్ట్‌లో వెళ్తున్న బాధితురాలి మెడలో బంగారం లాక్కునే ప్రయత్నం చేయగా, గట్టిగా కేకలు వేసిన బాధితురాలు. దీంతో చేతికి అందిన అర తులం నల్లపూసల గొలుసుతో పారిపోయిన అనితారెడ్డి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరగంటలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్న సనత్ నగర్ పోలీసులు