|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 08:35 PM
వీబీ జీరామ్ జీ' పథకం ద్వారా ఉపాధి కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు లభిస్తాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం స్థానంలో 'వీబీ జీ రామ్ జీ'ని ప్రవేశపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు. ఈ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే ఈ పథకానికి అదనంగా రూ.17 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలుకు అదనంగా రూ.340 కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు న్యాయం చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్‌లో ఈ పథకం పనులు జరగవని, దీనివల్ల కూలీలు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.