|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 05:07 PM
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు మరో దేశానికి విస్తరించాయి. త్వరలోనే జపాన్‌లో కూడా మన యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన ఎన్‌ఐపీఎల్, జపాన్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఎన్టీటీ డేటాతో మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో... జపాన్‌కు వెళ్లే భారత పర్యాటకులకు చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఎన్టీటీ డేటా నెట్‌వర్క్‌కు చెందిన వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్లలోని యూపీఐ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సులభంగా చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల అక్కడి వ్యాపారులకు కూడా వేగంగా లావాదేవీలు పూర్తి కావడంతో పాటు వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది.