![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 02:44 PM
భారత విద్యార్థి ఫెడరేషన్ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అంతకు ముందు విద్యార్థులతో జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ చందు, రాకేష్ , చంటి , నిఖిల్ అనూష ప్రవళిక తదితరులు పాల్గొన్నారు