![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 12:48 PM
ప్రభుత్వ విప్,ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వచ్చిన జీతాన్ని ప్రతినెల ఆలేరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.దేశంలోనే ఏ ప్రజా ప్రతినిధి కూడా ఇప్పటివరకు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 18 నెలల జీతాన్ని పేదలకు పంపిణీ చేశారు.ప్రభుత్వం నుంచి వచ్చే జీతంలో కేవలం 9 రూపాయలు మాత్రమే తన అవసరాల కోసం తీసుకుంటూ మిగతా డబ్బులను నియోజకవర్గంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్న ఐలయ్యకు అందరూ హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే!కాగా రోజు ఆలేరు మండలం కొలనుపాక గ్రామం రాకేష్ అనే నిరుపేద విద్యార్థికి బిటెక్ చదువు కోసం ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు తన నెల జీతంలో నుండి ఆర్థిక సహాయం అందజేశారు.తన తండ్రి నగేష్ కు కళ్ళు కనిపించకపోవడంతో ఎలాంటి ఉపాధి లేదు,దీంతో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారిని వారు ఆశ్రయించారు.బీర్ల అయిలయ్య గారు తన నెల జీతంలో నుండి వారికి సహాయం అందజేశారు.శుక్రవారం రోజు ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన అయిల వినోద్,బేతి ఆంజనేయులు ఇరువురి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.ఇంతే కాకుండా మరెన్నో సేవల కార్యక్రమాలు,ఆర్థిక సహాయాలు చేస్తున్నారు.