|
|
by Suryaa Desk | Fri, Jun 13, 2025, 03:51 PM
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ముగ్గురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీక రించారు. వారికి శాఖలు కేటాయించారు. ఢిల్లీలో కీలక మంత్రాంగం తరువాత వరుసగా కీలక నిర్ణ యాలు తీసుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు వేస్తు న్నారు. ఇక, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ జిల్లా ఇంఛార్జ్ మంత్రుల బాధ్యతల్లోనూ కీలక మార్పు లు చేసారు. కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తూ.. పాత వారిలో ముగ్గురిని ఈ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జి మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది. కొత్త మంత్రులకు జిల్లా ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్ వెంకటస్వామికి మెదక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బాధ్యతను కేటాయించారు. అదే విధంగా ఇప్పటికే ఇంఛార్జ్ మంత్రులుగా కొనసాగు తున్న వారిలోనూ మార్పులు చేసారు. కొందరికి జిల్లాలు మార్పు చేయగా.. మరో ముగ్గురిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా కు కొండా సురేఖ, కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇక, ప్రస్తుతం నల్గొండ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్ వరరావుకు తాజా మార్పుల్లో కరీంనగర్ జిల్లాను, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ గా ఉన్న జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లాను కేటాయించారు. మొత్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇంఛార్జ్ లుకా పదిమంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కీలక శాఖల నిర్వహణ లో ఉన్న ఒత్తిడి.. రాజకీయ సమీకరణాలు.. భవిష్యత్ ప్రణాళికలకు అనుగు ణంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దామోదర రాజనర్సింహ -మహ బూబ్ నగర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి - వరంగల్, పొన్నం ప్రభా కర్ - హైదరాబాద్, డి.అనసూయ (సీతక్క)- నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావు -కరీంనగర్, జూపల్లి కృష్ణారావు - ఆదిలాబాద్, గడ్డం వివేక్ వెంకటస్వామి- మెదక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రులుగా బాధ్యతలు కేటాయించారు.