![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:30 PM
కుంకీ ఏనుగులు శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి మానవులతో కలిసి పనిచేస్తాయి. భారత్, థాయ్‌లాండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని కుమ్కీ, కూంకీ, తప్పాన్ అని కూడా పిలుస్తారు. అడవి ఏనుగులను బంధించడం, శాంతింపజేయడం, గాయపడిన లేదా ఉచ్చులో చిక్కిన ఏనుగులను రక్షించడం, సంఘర్షణలో అడవి నుంచి వచ్చిన ఏనుగులను తిరిగి అడవిలోకి పంపడం వంటి పనులకు వీటిని ఉపయోగిస్తారు. అడవి ఏనుగులను సాటి ఏనుగుతో కట్టడి చేయడమే కుంకీ ఏనుగు ప్రత్యేకత.కుంకీ ఏనుగులు ప్రత్యేక శిక్షణ పొందిన మగ ఏనుగులు. ఇవి అడవి ఏనుగులను అదుపు చేయగలవు. కుంకీ ఏనుగులుగా సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి క్యాంపులో పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. ఇందులో అడవి ఏనుగులను తరిమేయడం, మచ్చిక చేయడం, ఆగ్రహంతో ఉన్న గజరాజులను అడవిలోకి పంపడం నేర్పిస్తారు. కుంకీలు ఏనుగుల గుంపు దాడులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని అడవిలోకి తిరిగి పంపే వరకు విడిచిపెట్టవు.