|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 12:56 PM
పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా నియమించింది.ఈ మేరకు ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖముఖ్య కార్యదర్శిగా కె.రామకృష్ణా రావు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. సీనియర్ ఐఏఎస్ శాంతి కుమారి ఇటీవలే పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణా రావును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్ట్‌లో సందీప్ కుమార్ సుల్తానియాకు నియమి