BREAKING
పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026

వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ ప్రతినిధి,  వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ రుద్రేశ్వర దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ ఈఓ, ఉత్సవ నిర్వాహకులతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ నాయకులు కోన శ్రీకర్,పల్లం రమేష్,తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.