తె.యూలోని వసతిగృహాల మెస్ కమిటీలతో నీటి, విద్యుత్ పై సూచనలు
సూర్య డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీలోని బాలుర, బాలికల వసతిగృహాల మెస్ కమిటీ సభ్యులతో విద్యుత్, నీటి పొదుపు చర్యలు, బియ్యం సరఫరా ధరల పెరుగుదల తదితర అంశాలపై చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వార్డెన్లు, కేర్‌టేకర్లు, వివిధ హాస్టళ్ల మెస్ కమిటీ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం విద్యుత్, నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని చేర్చించారు.ఈ సందర్బంగా చీఫ్ వార్డెన్ కె. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విద్యుత్ వినియోగానికి సంబంధించి,చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, భవిష్యత్తులో యూనివర్సిటీలో విద్యుత్ సరఫరా పరంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ఆయన సూచించారు. అవసరమైన సమయాల్లో మాత్రమే విద్యుత్ వినియోగిస్తూ, అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు ఇతర విద్యుత్ పరికరాలను ఆన్‌లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా, ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వృథా చేయకుండా, అవసరమైన మేరకే వినియోగిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.వసతిగృహాల మెస్‌ల నిర్వహణ సజావుగా కొనసాగించడంలో అందరు కలిసి పనిచేయాలని హితవు పలికారు.ఈ సమావేశంలో చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి తో పాటు వార్డెన్లు డాక్టర్ గంగాకిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ జ్యోత్స్న,వసతిగృహాల కేర్‌టేకర్లు, మెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.