సంగారెడ్డిలో ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాల తొలగింపు
సంగారెడ్డి;సంగారెడ్డి పట్టణంలో ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను శనివారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు.ఫుట్‌పాత్‌లు పాదచారుల వినియోగానికే అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. పట్టణంలో రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.