రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూర్ మేజర్ న్యూస్
అయిటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కట్టంగూర్,
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం స్పష్టం చేశారు. కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నిరంతరం శ్రమించే రైతులకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమగ్రమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సజావుగా పూర్తి చేయాలని, గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలనే వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ది సుక్కయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేష్ గౌడ్, బండారు కృష్ణ, సర్పంచులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తోటకూరి జలజ యాదయ్య, మాద మమతా సైదులు, గుల్లి నరేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుండు రాంబాబు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దపాటి దానయ్య, అయితగోని నారాయణ, కనకాల కేశవులు, బెజవాడ సైదులు, మిట్టపల్లి శివశంకర్, రెడ్డిపల్లి వీరస్వామి, ముత్యాల లింగయ్య, బద్దం సూర్యనారాయణ పాల్గొన్నారు.